
నవతెలంగాణ -తాడ్వాయి
అడవుల సంరక్షణ కోసం ఎఫ్ ఆర్ వో లు, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ల కృషి అభినందనీయమని పర్యావరణ, అటవీ, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడారం- రెడ్డి గూడెం లో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ క్వార్టర్ ను, చిలుకలగుట్ట లో బిట్ ఆఫీసర్ ల క్వార్టర్ లను పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, పి సి సి ఎఫ్ ఆర్ఎం డోబ్రియా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ అధికారుల చేస్తున్న కృషి అభినందనీయమని, అడవుల సంరక్షణ కోసం అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని సమాజం బాగుండాలంటే అడవులు బాగుండాలని ఆశయంతో అటవీశాఖ అధికారులు 24/7 పనిచేస్తున్నారని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.