డ్రగ్ నిర్ములన కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయం

నవతెలంగాణ – తొగుట
పోలీసు కమిషనర్ చేతుల మీదుగా తమ కూతు రు ప్రశంస పత్రం అందుకోవడం హర్షణీయం అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధ వారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ.. తుక్కాపూర్ గ్రామానికి చెందిన చిక్కుడు వైష్ణవి సిద్దిపేట పట్టణంలో సిటిజన్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుందని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాస రచన పోటీలలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రథమ స్థానం సాధించిన పత్రం సిద్దిపేట పోలీసు కమిషనర్ చేతులమీదుగా అందుకోవడం హర్షణీయం అన్నారు. పత్రం అందించిన సీపీ కి, డ్రగ్ నిర్ములన కోసం పోలీసులు చేస్తున్న కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన అనంతరం ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టిందని అన్నారు. అదే విదంగా పోలీ సు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అంటి డ్రగ్ నిర్ములన చేసేందుకు పోలీసులు విద్యార్థులతో గ్రామాలలో, పట్టణాలలో అవగాహన ర్యాలీలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు.