టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం ..

Election of TS UTF new committee is unanimous..నవతెలంగాణ -తాడ్వాయి 
మండల కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని శుక్రవారం జరిగిన మండల మహాసభలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు పరీక్షలు పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవారెడ్డి వ్యవహరించారు. నూతన మండల అధ్యక్షులుగా సుతారి పాపారావు, మండల ప్రధాన కార్యదర్శిగా అల్లం భాస్కర్, ఉపాధ్యక్షులుగా గుమ్మడి ప్రభాకర్, మహిళా ఉపాధ్యక్షులుగా కొమరం శ్రీష, కోశాధికారిగా గట్టి సురేందర్, మండల కార్యవర్గ సభ్యులుగా లకావత్ సురేష్, కోమల, చేల రాణి, హనుమంతు, సందీప్, రాజేష్, నరేష్, మరియు జిల్లా కౌన్సిలర్ గా పులిసె సమ్మయ్య, ఆడిట్ కన్వీనర్ గా సుధార రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు ఆర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ డి ఏ లను, పి ఆర్ సి ని ప్రకటించాలని అన్నారు. కేజీబీవీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనం స్కేలు ప్రకటించాలన్నారు. ఎస్ ఎస్ ఏ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారికి పనికి తగిన వేదనం పెంచాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నికైన టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు సుతారి పాపారావు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 15న జరిగే జిల్లా మహోత్సవాలు విజయవంతం చేయాలని ఉపాధ్యాయ బృందాలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.