
నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అయా మండలాల నూతన అధ్యక్షుల ఎన్నికలో పారదర్శకంగా వ్యవహరించాలనే సదుద్దేశ్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ త్రీ సభ్య కమిటీ ఏర్పాటు చేశారు.దీంతో బీజేపీ నూతన మండలాధ్యక్షుడి ఎన్నికలో హోరాహోరి పోటీ నెలకొని తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. నూతన మండలాధ్యక్షుడిగా కొలిపాక రాజు రెండవ దఫా ఎన్నికైయ్యారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, ఎన్నికల అధికారి సంకినేని వెంకటేశ్వర్ రావు కొలిపాక రాజుకు నూతన మండలాధ్యక్షుడిగా నియామకపత్రం అందజేశారు.తన ఎన్నికకు సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,ఎంపీ బండి సంజయ్ కుమార్,జిల్లాధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి,మండల ఎన్నికల అధికారి సంపత్ రావు,జిల్లా నాయకులు బాస సత్యనారాయణ,కోమలి అంజన్న,బోయినిపల్లి ప్రవీణ్ రావు,కరివేద మహిపాల్ రెడ్డి,చాడా వేంకట రెడ్డి,మాడ వెంకట రెడ్డి,గుర్రాల వేంకట రెడ్డి,ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి,సొల్లు ఆజయ్ వర్మ,మండల నాయకులు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలకు కొలిపాక రాజు కృతజ్ఞతలు తెలిపారు.