ఓటింగ్ యంత్రాలను అరోరా కళాశాలలో భద్రపరిచిన ఎన్నికల అధికారి

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్బంగా సోమవారం నాడు  పోల్ అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మంగళవారం  భువనగిరి పట్టణంలోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరిచినట్లు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు.  భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆలేరు, భువనగిరి,  తుంగతుర్తి, నకిరేకల్,  ఇబ్రహీంపట్నం, జనగాం, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను ఆయా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో కేంద్ర ఎన్నికల కమిషన్ జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే.జండగే, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ  అదనపు కలెక్టర్ పి. బెన్ షాలోమ్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.