
భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.