నియోజక వర్గం ఓటర్లు@ 1,60,580.. పురుషులతో పోల్చితే మహిళలే అధికం

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గంలోని 5 మండలాల్లో పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,60,580 మంది.ఇందులో పురుషులు 77,939 మంది,మహిళలు 82634 మంది, ట్రాన్స్ జెండర్ లు 7 మంది ఉన్నారు. పురుషు లతో పోల్చితే మహిళా ఓటర్లు 4,695 మంది అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ప్రకారం నియోజక వర్గం ఎన్నికల సహాయ అధికారి,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ సోమవారం ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 8 న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,59,594 మంది ఉండగా ఇందులో పురుషులు 77,540 మంది,మహిళలు 82,047 మంది,ట్రాన్స్ జెండర్ లు 7 మంది ఉన్నారు.గతేడాది సైతం పురుషులు కంటే మహిళా ఓటర్లు 4,507 మంది అధికంగానే ఉన్నారు. వయస్సు లు వారీగా 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల ఓటర్లు 1,09,215 మంది ఉండగా 50 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల ఓటర్లు 51,356 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు గా నమోదు అయిన ఓటర్లు 2,259 మంది కాగా 90 నుండి 99 సంవత్సరాల ఓటర్లు 526 మంది మాత్రమే ఉన్నారు. ఈ నియోజక వర్గంలో 49 సంవత్సరాల లోపు ఓటర్లు,మహిళా ఓటర్లే ప్రభావం చూపే అవకాశం ఉంది.