లైన్ కి అడ్డం వస్తున్నాయని చెట్లను తొలగించిన విద్యుత్ శాఖ

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత బీఅర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రతి సారి కార్యక్రమం నిర్వహించినప్పుడల్ల గ్రామ పంచాయతీ లకు వేల సంఖ్యలో టార్గెట్ విధించారు. దానిలో భాగంగానే అయా గ్రామాలలో గ్రామ పంచాయతీ ల అద్వర్యంలో వేలాది, లక్షలాది రూపాయలు వేచ్చించి ప్రభుత్వ,ప్రైవేట్ ఖాలీ స్థలాలు, ఎవెన్యూ ప్లాంటేషన్లు, గ్రామ నర్సరీ లను నేలకోల్పి మొక్కలను నటించారు. నర్సరీ లో విత్తనాలు వేసి, 8-10 నెలలు జాగ్రత్తగా పెంచి, చిన్న చిన్న మొక్కలను నాటి, ట్రాక్టర్ టాంకర్ ద్వారా ఉపాధిహామీ కూలీలతో ప్రతి మొక్క ను రక్షించేందుకు నీరు పోసి దానిలో కంపోస్ట్ ఇతర ఎరువులు వేసి  ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ను చేరుకోవడానికి అహర్నిశలు కష్టపడి పెద్దయ్యేలా కంటికి రెప్పలా జాగ్రత్తలు తీసుకున్నారు.
               ఇక్కడి వారకు అంతా బాగే ఉంది. అనాడు నాటిన మొక్కలు నేడు పలు చోట్ల వృక్షాలుగా అయ్యాయి. ఇక వర్ష కాలం వస్తుందని, విద్యుత్ లైన్లకు కొమ్మలు తగిలి సరఫరా నిలపకుండ ఉండేందుకు కోమ్మలను తోలగిస్తు ఉంటారు. కాని విద్యుత్ లైన్ కి నాడు పెట్టిన మొక్కలు నేడు అడ్డం వస్తున్నాయనే కారణం తో కొమ్మలను తొలగించకుండా మొత్తం చెట్లనే కంటికి కనబడిన చోట విద్యుత్ శాఖా సిబ్బంది రాహదారుల వెంబడి అడ్డూ అదుపు లేకుండా తోలగించేస్తున్నారు. రాహదరుల వేంట అనాడు మొక్కలు నాటించినప్పుడు అనాటి ప్రభుత్వం అన్ని శాఖలకు లక్ష్యం నిర్దేశించింది. మొక్కలు నాటించినప్పుడు పైనుండి విద్యుత్ లైన్ కు అంతరాయం ఏర్పడకుండా నాటించినా బాగుండేదని, నేడు అవి వృక్షాలుగా అయిన తర్వాత సజీవాలకు నీడ, పక్షుల ఆవాసం, రాకపోకలు సాగించే ప్రజలకు నీడనిస్తున్నాయి. గ్రామ సుందరీకరణకు పచ్చని చెట్లు ఎంతగానో దోహదపడుతుండేది. కాని నేడు అడ్డు అదుపు లేకుండా రహదారుల వెంట వేలాది రూపాయలు వెచ్చించి పెంచి పోషించిన చేట్లను నేడు ఘోరంగా గోడ్డలి వేటు వేస్తుండటంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ఇందల్ వాయి మండలంలోని గండి తండా కు వేళ్ళే రాహదరి వేంట దాదాపు 30 చెట్లను, 4-5 మీటర్ల ఎత్తు కలవి తోలగించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే కాకుండా ఇందల్ వాయి, డిచ్ పల్లి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలలో సైతం ఇదే విదంగా వృక్షాలను తోలగించినట్లు ఆయా గ్రామాలకు చెందిన పలువురు తెలిపారు. డిచ్ పల్లి నుండి నిజామాబాద్ కు వేళ్ళే రాహదరి వేంట కూడా చేట్లను నరికివేత కు గురైనట్లు పలువురు తెలిపారు. ఇకనైన పూర్తిగా చేట్లను తోలగించకుండా విద్యుత్ లైన్ కు అడ్డంగా వస్తున్న చేట్ల కోమ్మలను మాత్రమే తోలగించాలని అయా గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.