విద్యుత్‌ స్తంభాన్ని మరోచోటికి మార్చాలి

నవతెలంగాణ -వలిగొండ రూరల్‌
మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో పల్లె దవాఖాన ప్రహరీ గోడ లోపల ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని వెంటనే అక్కడి నుండి తొలగించి మరోచోటికి మార్చాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం రేపాక గ్రామంలో పల్లె దవాఖానను ఆ పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా అనేక సమస్యలు తమ దష్టికి వచ్చాయని తెలిపారు. పల్లె దవఖాన ప్రహరి గోడ లోపల విద్యుత్‌ స్తంభం ఉండడం వల్ల ఆసుపత్రికి వచ్చే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఆస్పత్రి పైభాగం నుండి విద్యుత్‌ వైర్లు ఉండడం వల్ల ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వెంటనే విద్యుత్‌ స్తంభాన్ని అక్కడనుండి మార్చి మరోచోట ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు ఓపి పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్న ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, కనీసం టాయిలెట్స్‌ లేకపోవడం వల్ల తీవ్రంగా అక్కడికి వస్తున్న ఉద్యోగులతో పాటు మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం బకాయిలో ఉన్న విద్యుత్‌ బిల్లులు 17వేల రూపాయలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రిలో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారని అన్నారు. వెంటనే మంజూరైన నూతన భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొడ్డి బిక్షపతి జువ్వగాని చంద్రయ్య స్థానికులు వెల్వర్తి యాదయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు.