సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ సందర్భంగా దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు. చాలా చిన్న వయసులో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను అక్కడ ప్రొడక్షన్ చేశాను. చాలా చిత్రాలను నిర్మించాను. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఫాహద్ ఫాజిల్‌ను, గోపీ సుందర్ వంటి వారిని ఇండిస్టీకి నేనే పరిచయం చేశాను. ఇప్పుడు మమ్ముట్టి, ఫాహద్ ఫాజిల్‌లతో ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను. ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ప్రతీ శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ఈ శుక్రవారం మాత్రం ప్రేక్షకులు చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను చూడబో తున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లోనే విలన్ ఎవరో కనిపెట్టండని ముందే సవాల్ విసురు తున్నాం. ఇంటర్వెల్ తరువాత విలన్ ఎవరో కనిపెడితే పది వేలు ఇస్తామని అంటున్నాం. 50 థియేటర్ల నుంచి.. థియేటర్‌కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున బహుమతిని అందిస్తాం. ఈ చిత్రంలో సాయి రామ్ శంకర్ చాలా కొత్తగా కనిపిస్తాడు.