– ఎం.పి.పి శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వరావుపేట
స్వచ్ఛదనంతో పరిసరాల పరిశుభ్రత,పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని స్థానిక ఎం.పి.పి శ్రీరామమూర్తి అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ నేపధ్యంలో శ్రమదానం నిర్వహించి పారిశుధ్యం,వైద్య,ఐసిడిఎస్ సిబ్బందితో పాటు విద్యార్థులచే పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లో హరిత హారం పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని వాటినే పేరు మార్చి ఈ ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ ప్రభుత్వమైనా తప్పని సరిగా నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు.మొక్కలు నాటడం వల్ల ఇప్పటికే దేశంలో 7.5 శాతం పచ్చదనం పెరిగిందని అందులో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. మొక్కల పెంపకంపై మరింత శ్రద్ధ వహించి అడవులను మరింత పెరరిగేలా చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి వేముల భారతి, ఎంపీఈఓ ఎస్ ప్రసాదరావు,మండల ప్రత్యేక అధికార ఏడి ప్రదీప్ కుమార్, ఈఓ శ్రీరామ్మూర్తి ఈజిఎస్ ఏపీఓ రామచంద్రరావు,హెచ్ ఎం హరిత,నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.