– ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీవో నెంబర్ 46పై క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46పై కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ చైర్మెన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను నియమించిందని పేర్కొన్నారు. ఈ జీవోలో ఉన్న లోటుపాట్లపై అధ్యయనం చేసిన ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరిందని తెలిపారు.