యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు అభినందనీయం

– వ్యాయామవిద్య ఉపాధ్యాయం సంఘం నేతల హర్షం
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయ నుండటం పట్ల వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (పెటా టిఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి. రాఘవ రెడ్డి, పొన్నగాని కృష్ణమూర్తి గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 12 స్పోర్ట్స్‌ అకాడమీలు, స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్లు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం అభినంద నీయం. రాష్ట్ర బడ్జెట్‌లోనూ క్రీడలకు రూ.325 కోట్లు కేటాయించి పెద్ద పీట వేశారు. దక్షిణ కొరియా నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో ఏర్పాటు కాబోతున్న యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో రాష్ట్ర క్రీడాకారులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు లభించనున్నాయని’ అని ఓ ప్రకటనలో తెలిపారు.