
– మండలంలో 5 రోజులు మొబైల్ డెమోన్స్ట్రేషన్ వ్యాన్ ద్వారా విస్తృత ప్రచారం
నవతెలంగాణ- తాడ్వాయి
ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతం అని స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఐదు రోజులు ఈవీఎం, వి వి పి ఏ టి మొబైల్ డెమోన్స్ట్రేషన్ వ్యాన్ ద్వారా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు సోమవారం తాడ్వాయి, కొండపర్తి, లవ్వాల గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రేపు మంగళవారం 29వ తారీకు వెంగళపూర్, పడిగాపూర్, నార్లాపూర్, కాల్వపల్లి, కొత్తూరు, మేడారం, బయ్యక్కపేట గ్రామాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్లుండి బుధవారం 30వ తారీకు నాడు కామారం(పీటి), గంగారం, కాటాపూర్, దామరవాయి, 31 గురువారం నాడు రంగాపూర్, బీరెల్లి, అంకంపల్లి, పంబాపూర్ నర్సాపూర్(పిఏ) గ్రామాలలో, ఒకటవ తారీకు శనివారం బంధాల, బొల్లెపల్లి, లింగాల, బిట్టుపల్లి(కొడిశెల) గ్రామాలలో ఐదు రోజులు ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మారుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం గా ప్రకటించినది అని, కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుందని తెలిపారు. ఈ ఐదు రోజుల అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఓటర్లు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు.