పల్లెల, పట్టణ ప్రజల చూపులు బీఆర్‌ఎస్‌ వైపే

– ఇబ్రహీంపట్నం గడ్డపై బీఆర్‌ఎస్‌దే విజయం
– బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు చీరాల రమేశ్‌
నవతెలంగాణ-మంచాల
పల్లె, పట్టణ ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపే ఉందని, ఇబ్రాహీం పట్నం గడ్డపై మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి విజయ దుందుభి ఖాయమని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చీరాల రమేష్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పీసీ తండ, నోముల, లోయపల్లి, బోడ కొండ గ్రామాల్లో బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలు గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల అధ్వర్యంలో జరిగాయని ,బీఅర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ,ఇబ్రహీం పట్నంలో మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత బహదూర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, సర్పంచులు పల్లాటి బాల్‌ రాజ్‌, మేఘవత్‌ రాజు నాయక్‌, సీనియర్‌ నాయకులు కే.రాం రెడ్డి, ఎం డి జానీ పాషా, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్ష,కార్యదర్శులు వన పర్తి బద్రీనాథ్‌ గుప్త, గంట విజరు, నారి యాదయ్య, ఎస్‌ సి సెల్‌ మండల అధ్యక్షులు నల్ల ప్రభాకర్‌, బత్తుల కరుణాకర్‌ రెడ్డి,గంట హనుమంతు, యువజన విభాగం నియోజక వర్గ ప్రచార కార్యదర్శి చింత క్రింది విరేశ్‌ ,నాయకులు పల్లాటి శ్రీనివాస్‌,సుధాకర్‌ ,పోలమోని విష్ణు యాదవ్‌ తదితరులు ఉన్నారు.