నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి గ్రామ శివారులోని 246 సర్వే నెంబర్ లో గత కొన్ని ఏళ్ల నుండి రైతులు ఈ భూమిలో కబ్జాలో ఉండి, భూమి పట్టా కోసం ఎన్నో పోరాటాలు చేశారని, గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న దివంగత రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు 4 వ విడత భూ పంపిణీలో భాగంగా వారికీ భూమికి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు దేవస్వామి, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వి సాయినాథ్ లు అన్నారు.గురువారం రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాటి నుండి నేటి వరకు వారు భూమి చదును చేసుకొని అందులో బోర్లు వేసుకొని పంట పండిస్తున్నారని వివరించారు ఇనాటికి వారు కబ్జాలోనే ఉన్నారని, వారి భూమికి పట్టాలు సైతం ఉన్నాయని కానీ ఈరోజు మాకు తెలియకుండా ఎవరో వచ్చి సర్వే చేస్తున్నారనే సమాచారం మేరకు అ భూమి వద్దకు వెళ్లి వారిని అడిగితే పల్లె సాయికుమార్, పల్లె శ్రీనివాస్ తమకు ఈ భూమి ని అమ్మినరాని అన్నారు. వారు కొన్ని ఏళ్ల నుండి పంట పండిస్తున్నరని, వారికీ న్యాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో సుప్రియ, సాయిలు, లక్ష్మి, గంగామణి, చిన్న ఒడ్డెన్న, సావిత్రి, రాజమణి శాంతా,పోసాని,కర్రేవ్వ, పోసాని తోపాటు తదితరులు పాల్గొన్నారు.