ఆర్పీల న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలి

– అర్బన్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ లకు మెప్మ అర్పిల వినతి
– ఏడు నెలల పెండింగ్ వేతనాలు పెంచాలని డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్: మెప్మా అర్పిల న్యాయమేనా డిమాండ్లను పరిష్కరించాలని రిసోర్స్ పర్సన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడు నెలలుగా తమకు వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మెప్మా పిడి రాజేందర్ లను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్వరలత మాట్లాడుతూ.. 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తాము మెప్మా ఆర్పిలుగా ప్రభుత్వాల తరఫున, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత 2018లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 4,000/- గౌరవ వేతనం అమలు చేసిందన్నారు.
2023 లో మరో మారు 756 జీవో ద్వారా, మరో రెండు వేలు పెంచి ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. కానీ ఇప్పటివరకు తమ వేతనాలు పెంపు కాలేదని వాపోయారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో మెప్మా ఆర్పీలు ఎంతో కృషి చేస్తున్నారని, అనేక సర్వేలు చేసి, సమగ్రమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నామని పేర్కోన్నారు. కావున ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం తమకు సరిపోవటం లేదని, నూతన ప్రభుత్వం స్పందించి మెప్మా అర్పిల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అర్పిలకు నెలకు 20 వేల వేతనం, డ్రెస్ కోడ్,10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, కోశాధికారి స్వప్న, ఆర్పీలు జమున, ప్రమీల, సుజాత, హరిత, రాజమణి తదితర ఆర్పీలు పాల్గొన్నారు.