
డొంకేశ్వర్ మండలంలోని నూత్ పల్లి గ్రామానికి చెందిన, పుట్టా సాయన్న వయస్సు 43, సౌదీ అరేబియాలోని ధమ్మా మ్ కు దగ్గర లోని దక్షిణ దహరాన్ పట్టణంలో ప్రధాన కాంట్రాక్టర్ పని చేస్తూ సడన్ హాట్ అటాక్ తో ఈనెల 4 వ తేదీన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాయన్న మృతదేహాన్ని తొందరగా ఇండియాకు రప్పించవలసిందిగా కోరుతూ సాయన్న తమ్ముడు శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు బుధవారం ” ప్రవాస భారతీయులు హక్కులు సంక్షేమ వేదిక ” అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి అభ్యర్థించారు. కోటపాటి వెంటనే స్పందించి, సౌదీ రాయబార కార్యాలయం కు కావలసిన సమాచారాన్ని పంపి, ఢిల్లీలోని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తగిన చర్యలకై సాంప్రదించడం జరిగింది. సాయన్న కొడుకు దినేష్ (20) ప్రస్తుతం యూఏఈ లోని అబుధాభి లో పనిచేస్తున్నాడు. అతని కంపెనీ దినేష్ ను ఇండియాకు పంపడానికి నిరాకరించడం జరిగింది. విషయం తెలుసుకున్న కోటపాటి అబుధాభి లో తెలుగు ప్రవాసుల కోసం సేవ చేస్తున్న రాజా శ్రీనివాస్ రావు కు విషయం తెలిపి, పుట్ట సాయన్న అంత్యక్రియలు జరపాల్సిన సొంత కొడుకును ఇండియాకు పంపించే విధంగా కంపెనీ వారితో మాట్లాడి సహాయం చేయాల్సిందిగా కోరారు. రాజా శ్రీనివాస్ రావు వెంటనే స్పందించి, అబుదాబి భారత రాయబార కార్యాలయ అధికారుల ద్వారా దినేష్ పనిచేస్తున్న కంపెనీ వారిని ఒప్పించి దినేష్ కు సెలవు పాస్ పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపడానికి ఒప్పించారు. ఈ సందర్భంగా రాజ శ్రీనివాస్ రావు కు కోటపాటికి ధన్యవాదాలు తెలిపారు.