మృతి చెందిన గీత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి

– గీత పారిశ్రామిక సహకార సంఘం ( సొసైటీ ) అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో తాటి చెట్టు పై నుండి పడి మృత చెందిన గీత కార్మికుడు మాటూరి రవీందర్ గౌడ్  కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గీత పారిశ్రామిక సహకార సంఘం ( సొసైటీ ) అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్ కోరారు. తాటికళ్ళు గిసుకొని బతికే గీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. చనిపోయిన గీత కార్మికుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక సంఘం (సొసైటీ) ఉపాధ్యక్షుడు తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు పెరుమాండ్ల నర్సాగౌడ్, పచ్చిమట్ల రాజయ్య గౌడ్,  పూదరి సత్యనారాయణ గౌడ్, ఇల్లందుల తిరుపతి గౌడ్, తాళ్ల పెళ్లి మల్లేశం గౌడ్,  బొడుగే వెంకటేష్  గౌడ్ , పచ్చిమట్ల రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.