
ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో పోస్ట్ మెన్ ఎల్లయ్య వడ దెబ్బతో మృతి చెందగా ,మృతుని కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశము కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మృతి చెందిన ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లయ్య చిత్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి ఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు వేల్పుల శంకర్, బిఎస్పి పార్టీ సీనియర్ నాయకులు ఎడెల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.