మూడో విడత రుణమాఫీ అయినప్పటికీ, తనకు రుణమాఫీ కాలేదని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన ఒక రైతు, మందు డబ్బాతో ఆత్మయత్నానికి పాల్పడ్డ సంఘటన మండలంలోని కవ్వాల్ గ్రామంలో లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే కవ్వాల్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చన్నకు, బ్యాంకులో రెండు లక్షల రూ.40,000 రుణంతీసుకున్నాడు. ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడంతో, ఆ రుణమాఫీలో అతనికి ఏమాత్రం రుణమాఫీ కాలేదని, మనస్థాపానికి గురై, శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పక్కనే ఉన్న మరో రైతు గుడ్ల బుచ్చన్న మందు డబ్బాని లాక్కున్నాడు. గ్రామంలో మొత్తం సుమారు 80 మందికి పైగా రుణమాఫీ కాలేదని, రైతులు ఆందోళన చెందుతున్నారు. కవ్వాల్ గ్రామం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ, ఆ గ్రామంలో కొంతమంది రైతులకు పట్టాలు ఉన్నాయన్నారు. వారికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ ఖాన్ వివరణ కోరగా,ప్రస్తుతం ఒకటి రెండు మూడు దశలలో, రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ జరిగిందని రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులకు ప్రభుత్వ జీవో ప్రకారం నిర్ణయం ఉంటుందని తెలిపారు.రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.