– అసలు ముద్దాయి కేటీఆరే…
– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతుబంధు కోసం భూ అక్రమ దారులు రాబందుల మారారని,అసలైన రైతులకు పట్టాలు లేవని,కేటీఆర్ అనుచరులకు పాస్ బుక్కులు ఇలా వచ్చాయని, అసలైన ముద్దాయి కేటీఆరేనని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్న దేశాయిపల్లి గ్రామ శివారులోని 338 సర్వే నెంబర్ లో 150ఎకరాల భూమి అన్యాక్రాంతమైన భూమిని ఆదివారం రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ… దేశాయిపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి 550 ఎకరాలు ఉండగా అందులో 220 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ అధికారులు తీసుకోగా, 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రైతులు సాగు చేసుకోగా, మిగులు ప్రభుత్వ భూమి వందల ఎకరాలు అన్యక్రాంతమైందని పేర్కొన్నారు. అందులో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనుచరులు అక్రమ పట్టాలు చేసుకొని కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏండ్ల కాలం నుండి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేవు కానీ భూ అక్రమ దారులకు పట్టాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేటీఆర్ అనుచరులకు వందల ఎకరాలు అప్పజెప్పడానికి అప్పటి కలెక్టర్కు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. భూమిలో కాస్ట్ కు లేకున్నా సరే కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్ కేటీఆర్ అనుచరులకు అక్రమంగా పట్టాలను మంజూరు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అసలైన రైతులు అధికారుల చుట్టూ ప్రతిక్షణం చేసిన ఏ ఒక్క పట్టా జారీ కాలేదన్నారు. అక్రమంగా పట్టాలు చేసుకుని ఏళ్ల తరబడి రైతుబంధును తిని ఇప్పుడు మళ్లీ రైతుబంధు ఇవ్వలేదంటూ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు.రైతు బంధు సొమ్మును రాబందువుల్లా మెక్కితిన్న రైతు బంధు కక్కించాలని రైతులకు అండగా ఉండేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు.రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలి ఇప్పించే విదంగా, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కెకె మహేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సహకారం తో సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.