దేశానికి వెన్నుముక రైతు

– నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుశీల చింతల
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ప్రపంచంలోని మానవాళి అంతటికీ ఆహా రాన్ని అందించే రైతు దైవంతో సమానం అని నాబా ర్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుశీల చింతల అన్నారు. రైతాంగం స్థితిగతుల్ని మెరుగుపరి చేందుకు నాబార్డ్‌ నిరంతరం కృషి చేస్తుందని వివరిం చారు. రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యాసంస్థలో శుక్రవారం జరిగిన కొనుగోలుదారులు-అమ్మకం దారుల మొదటి ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకీ జనాభా పెరుగు తూ ఉండడంతో పాటు వారి ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, కొత్త కొత్త టెక్నాలజీలు అందు బాటులోకి వస్తున్నాయని అన్నారు. అందుకు తగ్గ ట్లుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మారాలని సూచించారు. వాటి పరిధి విస్తృతం కావాలన్నారు. ఎఫ్‌పీఓల విషయంలో భవిష్యత్తులోనూకి తోడ్పా టు అందించే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటిం చారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రైతు వేది కలని వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించిందని ఉగాదిలోగా అన్ని రైతువేదికలోనూ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముందని వివరిం చారు. రైతులు బలోపేతం అయితేనే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ సీమ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ డిమాం డ్‌ కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులుండాల న్నారు. ఎఫ్‌పీఓలు సొంత బ్రాండ్లు అభివృద్ధి చేసు కోవాలని సీవతు సూచించారు. ఎఫ్‌పీఓలు ముం దు ముందు ఫెడరేషన్‌గా అభివృద్ధి చెందాలని మేనేజ్‌ డైరెక్టర్‌ గుమ్మ గోలిమత్‌ అన్నారు. కార్యక్రమంలో ఎవర్‌ గ్రీన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రతినిధి ప్రసాదరావు పాశం, మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది, రైతులు, మహిళా రైతులు, విద్యార్థులు పాల్గొ న్నారు. డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ వందన సమర్పణ చేశారు.