రైతు బీమాలాగా కూలి బీమా ప్రవేశ పెట్టాలి చేయాలి

– ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తున్న కేంద్రం
– పనిదినాలని 100 నుండి 200 రోజులు కల్పించాలి.
– రోజుకు 600 రూపాయల కూలి చెల్లించాలి.
– ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ షరతును ఎత్తివేయాలి. 
నవతెలంగాణ –  కామారెడ్డి , బీబీపేట్ 
ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచాలని, రోజుకు సగటున 600 రూపాయల కూలి అందించాలని, ఉపాధి హమీ కూలీలకు భూమి కలిగిన వ్యవసాయ కూలీలకు ఇచ్చే రైతు భీమా మాదిరిగా ఉపాధి హామీ కూలీకి  కూలీ భీమా ప్రవేశపెట్టాలని,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ షరతును ఎత్తివేయాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట ర నాయకులు తలారి ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
 సోమవారం  కామారెడ్డి మున్సిపల్ ఆవరణ లో ఫిబ్రవరి 02, న జాతీయ 19 వ  గ్రామీణ ఉపాధి హమీ కూలీల దినోత్సవ ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా  డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో 7,86,927 గ్రామాలలో 14.55 కోట్ల ఉపాధి హమీ జాబ్ కార్డు కలిగిన కుటుంబాలుంటే పనికి వెళ్ళెవారికి సంఖ్యపరంగా చూసుకుంటే 3 లక్షల కొట్లు అవసరముంటే 2024 –  25 బడ్జేట్ లో కేటాయించిన మాదిరిగానే 2025 –  26 బడ్జేట్ లో 86 కోట్లు మించిపెంచకపొవటం పట్ల కూలీల పట్ల కేంద్రం సంవత్సరానికింత అన్యాయం చేస్తు సంవత్సరానికి ప్రతి కూలీ కుటుంబానికి 100  రొజుల పనిదినాలకు గాను కేవలం 41 రొజులు మాత్రమే కల్పిస్తూ  చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 53.07 లక్షల జాబ్ కార్డులుంటే 1.10 కోట్ల ఉపాధి కూలీలకు కేంద్రం 9800 కోట్లు అవసరముంటే కేవలం 4,416 కోట్లు మాత్రమే కేంద్రం  కేటాయించి కూలీలను ఉపాధి హమీ పనుల నుండి దూరం చేస్తున్నారన్నారు. 20 రొజులు పనిచేసిన కుటుంబాలకు మత్రమే భరోసా ఇస్తామనే నిబంధనలను తీసివేయాలని, దిని వలన తక్కువ కుటుంబాలు మత్రమే అర్హత సాదించే అవకాశముందన్నారు. కనుక కూలీలకు ఉపాధి హామీ షరతును ఎత్తివేయాలని, కూలీలకు ప్రస్తూతం అమలుచేస్తున్న రెండు లక్షల ప్రమాద భీమాను 10 లక్షలకు పెంచాలని,ఉపాధి హమీ కూలీకి 600 వేతనాన్ని ఇవ్వాలని,పని కల్పించలేని పరిస్థితిలో కూలీలకు నిరుద్యోగ భృతి చెల్లించాలని,ఉపాధి హమీ కార్డులను తొలగించకుండా ఉపాధి హమీని కూలీలకు హక్కుగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి బి ఎఫ్ జిల్లా మహిళా నాయకులు  ముక్క సరోజ, రాష్ట్ర నాయకులు భీమ్ శేఖర్, మహేష్  తదితరులు పాల్గొన్నారు.