15 రోజుల క్రితం వర్షం కోసం ఎదురుచూసిన రైతన్న.. ప్రస్తుతం ఆగని వర్షాలతో ఆందోళన

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలో ఈ ఏడాది వానాకాలం పంట సాగులో భాగంగా ఇక్కడి రైతన్న పెసర మినుము సోయా పత్తి కంది తదితర పంటలు సాగు చేశారు. ఈ పంటలకు సరియైన సమయంలో వర్షాలు పడక ఆందోళన చెందుతూ రైతన్నలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు ఆలయాలు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు 15 రోజుల క్రితం వర్షాల కోసం ఎదురుచూసిన రైతన్న, ప్రస్తుతం వారం పది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆగని వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పంటలకు అతివృష్టి వర్షాలు నష్టం కలిగిస్తాయి దాదాపు వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు వర్షాలతో పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయని రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ మండలంలో దాదాపు ఈనెల 17 నుండి ఈనెల 26 వరకు కురిసిన వర్షాపాతం వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం 25 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఈనెల 17న 3.2 మిల్లీమీటర్లు ఈనెల 19న 43,2 ఈనెల 20న 1.2 ఈనెల 21న 33.0 మిల్లీమీటర్లు ఈనెల 22న 64.2 ఈనెల 24న 4.2 ఈనెల 25న 39.0 ఈనెల 26న 23,0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది. వారం పది రోజుల నుండి కురిసిన వర్షాపాతం 25 సెంటీమీటర్లు కురిసింది భారీ మొత్తంలో కురుస్తున్న వర్షాలకు పూతకాతకు వచ్చిన పంటలు దెబ్బతింటున్నట్లు ఇక్కడి రైతన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీడపురుగుల బెడద అధికమవుతున్నట్లు రైతన్నల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. వాతావరణ కేంద్రం మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటూ తెలియజేయడం ఇక్కడి రైతన్నల్లో మరింతగా ఆందోళన కలిగిస్తుంది.