
నవతెలంగాణ – మద్నూర్
రైతులు పండించిన శనగ పంట ఒక సంవత్సరం విత్తనానికి పని చేస్తుందని నేషనల్ సీడ్ కంపెనీ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శరత్ బాబు తెలిపారు. విత్తన శుద్ధిపై రైతులకు ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామ శివారులో శనగ పంట చేనులో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు నేషనల్ సీడ్ కంపెనీ జనరల్ మేనేజర్ శరత్ బాబు మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ కమిటీ సభ్యులు వ్యవసాయ రైతులు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. విత్తన శుద్ధి పై నేషనల్ సీడ్ కంపెనీ జనరల్ మేనేజర్ అవగాహన కల్పించారు. సబ్సిడీపై విత్తనాలు పొందిన రైతులు సాగు చేసిన శనగ పంట దిగుబడి వచ్చినా తరువాత ఒక సంవత్సరం విత్తనానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దానిని ఏ విధంగా ఎలా ఉంచాలనే దానిపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.