– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష_కార్యదర్శి, చింతల శివ_ లావుడియా రాజు..
నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా పాలన కొనసాగుతుందని, రూ. 6300 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష_కార్యదర్శి,చింతల శివ, లావుడియా రాజు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని వాతల్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ సభ్యత క్యాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళాశాల నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని తెలిపారు. మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అల్లాడిపోతున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి రూ. రూ.6300 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి,పత్రికా ప్రకటనకే పరిమితం అవుతున్న ఈ ప్రభుత్వం హామీల విషయంలో శూన్యం ప్రదర్శిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేట్ యాజమాన్యాలు కళాశాలల బందు చేసే పరిస్థితి నెలకొన్నదని తెలియజేశారు. విద్యార్థులు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థుల సమస్యల గోడును వినేది ఎవరని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు, లేనియెడల జిల్లాలో ఎక్కడికక్కడ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది , ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిఈర్ల రాహుల్,జిల్లా కమిటీ సభ్యులు భవాని శంకర్ ,నాయకులు మహేష్, ఆకృత్, శివాజీ,చందు,పూజిత, మేఘన, సంజన, భావుగా లక్మి , శివాని, ఉమ పాల్గొన్నారు.