
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి జాతర ఉత్సవ కమిటీ సభ్యులుగా బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఫెస్టివల్ కమిటీ సభ్యులకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేసినారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు సమూహాలు గా ఏర్పడి జాతర కు వచ్చే భక్తుల సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలి అనిజాతర ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దిశా నిర్దేశం చేశారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామి వారి దర్శనము అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం అయి రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర కు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేసున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫెస్టివల్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఫెస్టివల్ కమిటీ సభ్యులందరూ సమూహాలుగా ఏర్పడి భక్తుల సౌకర్యం ఏర్పాట్లు చేసిన వాటిని ఏలోటు రాకుండా పరిశీలించాలని సూచించారు. భక్తుల సేవ పరమార్ధంగా భావించి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ సభ్యులు అనుమల్ల చంద్రం(జగిత్యాల ),వడ్డేపల్లి వెంకటరమణ(హుస్నాబాద్), కే రాజిరెడ్డి(సిరిసిల్ల ),సి, విజయలక్ష్మి(మంథని),సాగరం వెంకటస్వామి(వేములవాడ ),పాత సత్యలక్ష్మి(వేములవాడ ),కూరగాయల కొమరయ్య(వేములవాడ ),సంద్రగిరి శ్రీనివాస్(వేములవాడ ),కనికరఫు రాకేష్(వేములవాడ),నాంపల్లి శ్రీనివాస్(నాంపల్లి),పులి రాంబాబు(వేములవాడ ),తూము సంతోష్(వేములవాడ ),వకులాభరణం శ్రీనివాస్(నూకాలమర్రి),పిల్లి కనకయ్య(రుద్రవరం ),సంగ స్వామి యాదవ్(శత్రాజపల్లి ),జగన్మోహన్ రెడ్డి(నిజామాబాదు ),చేపూరి గంగయ్య(నిమ్మపల్లి ),చింతపంటి రామస్వామి( నర్సింగాపూర్),కాయితీ నాగరాజు(దుంపేట ),తోట్ల అంజయ్య(పోతారం) ,ఏనుగు రమేష్ రెడ్డి(దమ్మన్నపేట),సింగిరెడ్డి నరేష్ రెడ్డి(మన్నెగూడం),ధర్నా మల్లేశం(రుద్రంగి)లతో పాటుగా ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.