ఐదో రోజు అదే జోరు.. 

1456 దరఖాస్తులు స్వీకరణ 
నవతెలంగాణ- దుబ్బాక/ దుబ్బాక రూరల్
మెదక్ ఎంపీ చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లకు  శనివారం 1456 దరఖాస్తులు వచ్చాయని  బీ ఆర్ ఎస్ శ్రేణులు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ 18 ఏళ్ళు పై బడిన యువతి యువకులకు ఈ నెల 13 వ తేదీ సాయత్రం 4గంటల వరకు దుబ్బాక ఎంపీ క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకావాలన్నారు. అందుకు గాను పదో తరగతి మెమో, ఆధార్ లేదా పాన్ కార్డ్ జిరాక్స్ లతో పాటు 2 ఫోటోలు వెంట తెచ్చుకోవాలని అన్నారు. ప్రారంభం నాటి నుండి నేటి వరకు 8274 దరఖాస్తులు అందాయన్నారు. కార్యక్రమంలో రఘోత్తంపల్లి చందు రెడ్డి,ఇస్తారిగల్ల చరణ్ తేజ్, మల్లు గారి ప్రేమ్, దరఖాస్తుదారులు ఉన్నారు.