నవతెలంగాణ – భీంగల్
మహేష్ బాబు కథానాయకుడిగా విడుదలైన గుంటూరు కారం సినిమాలో విలన్స్ కు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టి వారి పాత్రలను చెడుగా చూపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పి డి ఎస్ యూ భీమ్ గల్ మండల కన్వీనర్ ఎం. నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కు మతిబ్రమించి, ప్రపంచ కమ్యూనిస్ట్ విప్లవ కారులు, మార్కిస్ట్ మహోపాధ్యాయుల పేర్లను ఈ సినిమా లో విలన్స్ కి పెట్టి, సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు. కారల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. శ్రామిక వర్గ సిద్ధాంతం “దాస్ కాపిటల్ ” రచించి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గాన్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని ధారపోశారు. దోపిడీ, పీడనా, అణచివేత లేని సోషలిస్టు సమాజాన్ని ఏర్పరిచారు. అలాంటి మహానేతల పేర్లని గుంటూరు కారం సినిమాలో విలన్స్ కి పెట్టడం తీవ్రమైన అభ్యంతరకరం. చిత్ర నిర్మాణ బృందం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చశాడు.