నెలాఖరు లోగా మున్సిపాల్టీకి తుది రూపు కమీషనర్ కే.సుజాత

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ నెలాఖరు లోగా అశ్వారావుపేట మున్సిపాల్టీ కీ పరిపాలన,భౌగోళికంగా తుది రూపు సంతరించుకోనుంది అని కమీషనర్ కే.సుజాత గురువారం నవతెలంగాణ కు తెలిపారు. ఇప్పటికే మూడు పంచాయితీలకు చెందిన గణాంకాలు, గత కాలం ఆర్ధిక లావాదేవీలకు చెందిన నివేదికలు,స్థిర చరాస్తుల వివరాలను సేకరించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఈ పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న కార్యదర్శులు, కార్యనిర్వాహణ సిబ్బంది,పారిశుధ్య కార్మికుల వివరాలతో కూడిన సమాచార నివేదికను మున్సిపల్ శాఖకు పంపుతాం అని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం సిబ్బందికి విధులు కేటాయిస్తామని అన్నారు. త్వరలో మున్సిపాలిటీ భౌగోళిక పటం రూపొందించి, వార్డుల విభజన చేపట్టి ఓట్లు కేటాయించి నమూనా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. వారివెంట పీఏ చావా రవి ఉన్నారు.