నవతెలంగాణ-కాగజ్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా చేపడుతున్న స్వఛ్చదనం-పచ్చదనం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కాగజ్‌నగర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల (ఓల్డ్)లో విద్యార్థులకు చెట్ల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓలు జి దేవిదాస్, ఇక్బాల్ హుస్సేన్, పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు నసీర్ తదితరులు పాల్గొన్నారు.