నిప్పు

గొంగళి పురుగు
దుర్భేద్య పర్యవేక్షణ తో వుంటుంది
దానికేం భయం
అవి పాకినంత మేర
దురదనో, అసహ్యాన్నో కలిగిస్తుంటాయి
తన రక్షణకు
ఆయుధ కవాతుల తో
ముళ్ళ కంచెలు నిర్మించుకుంటారు
భయస్తులు
కాపలా వున్నంత కాలం
తమ రాజ్యాన్ని స్తాపించుకుంటారు

బాదితుల కవాతులోని
ఏ కొందరి చేతనైనా నిజాయితీ అనే నిప్పును
దురలవాటైనా సిగరేటు తాగించడం, ముట్టించడం
అలవాటుగా, హాబీగా మార్చాలి
కాపలావున్న గడ్డి వాముకు, ఆ అలవాటు నుండే
ఉద్దేశం తో కాకపోయినా
నిద్ర పోతూనో
జొగుతూనో నిప్పును జారవిడుస్తాడు

నిప్పు ప్రవహిస్తుంది
ఎగ బాగుతుంది
ప్రజాస్వామ్య వ్యవస్థలోని గొంగళి పురుగు నియంతలు
సమూలం గా నిర్మూలి0చ బడతారు

నిప్పును
ఎవరు కలిగి వున్నారనేదే ముఖ్యం.
-హనీఫ్‌, 9247580946