తొలి దెబ్బ ఆసీస్‌దే

The first blow was the Aussies– భారత్‌, ఆసీస్‌ మహిళల తొలి వన్డే
ముంబయి: టెస్టు సిరీస్‌ ఓటమి నుంచి పుంజుకున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు వైట్‌బాల్‌ సిరీస్‌లో శుభారంభం చేశారు. గురువారం ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ అమ్మాయిలు 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. తొలుత టీమ్‌ ఇండియా అమ్మాయిలు 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేశారు. జెమీమా రొడ్రిగస్‌ (82, 77 బంతుల్లో 7 ఫోర్లు), పూజ (62, 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), యస్టికా భాటియా (49, 64 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. ఆస్ట్రేలియా అమ్మాయిలు 46.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. లిచ్‌ఫిల్డ్‌ (78), ఎలిసీ పెర్రీ (75), తహ్లియ మెక్‌గ్రాత్‌ (68), బెత్‌ మూనీ (42)లు ఛేదనలో మెరిశారు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ముందంజలో నిలిచింది.