తొలి ఏకాదశి పండుగ

నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలోని దేవాలయాల వద్ద తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు రామకృష్ణ హరే రామ హరే కష్ణ మఠాలలో భక్తులు కీర్తనలు పాడారు .దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి ఉపవాస దీక్షలు నిర్వహించారు. భువనగిరి పాత బస్టాండ్‌ లోని హరే రామ హరే కష్ణ మఠం వద్ద ప్రత్యేక అలంకరణతో శ్రీకష్ణుని అలంకరించి 24 గంటల పాటు కీర్తనలు చదివారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని హరే రామ హరే కష్ణ మఠం నిర్వాహకులు దిడ్డికాడి హరి తెలిపారు. ఆలేరుటౌన్‌, ఆలేరు పట్టణంలో గురువారం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తులు శ్రధ్ధలతో నిర్వహించారు. పట్టణంలోని శ్రీ గోదాదేవి లక్ష్మీదేవి సహిత రంగనాయక స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోత్రనామాలతో అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బి అధికారి సత్యనారాయణ, నంద గంగేష్‌, పత్తి సతీష్‌ , యేలుగల కుమారస్వామి, ముప్పిడి సత్యనారాయణ,మంచన మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.