మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగను బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు మహిళ లు అధిక సంఖ్యలో స్థానిక ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిని పేలపు పిండి పండగ కూడా అని అంటారు. ఈ రోజు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జొన్నలను వేయించగా వచ్చిన పేలాలను పిండిగా చేసి అందు తీపి పదార్థాలను కలిపి దేవుడికి తొలి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులందరికీ సత్తుపిండిని పంచుతారు. ఎంతో పోషక విలువలు ఉన్న ఈ సత్తు పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పూర్వీకులు తెలుపుతారు. పండగ రోజు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని ఆరోగ్యానికి హాని కలుగుతుందని పలువురు వేద పండితులు తెలిపారు. రాశులు ఫలాలు ఈరోజుతో కొందరికి మారతాయని అందరికీ మహర్దశ కలుగుతుందని మరికొందరికి సాధారణంగా ఉంటుందని తెలిపారు.
ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి..
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని దేవి పంచాయతన ఆలయంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.