ప్రజా ఏక్త పార్టీతొలి జాబితాను ప్రకటించిన 

 – ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ 
 నవతెలంగాణ -సుల్తాన్ బజార్ :
వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఏక్తా పార్టీ 15 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం గౌలిగూడ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. జంటనగరాలతో పాటు తెలంగాణలోని పలు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తు కేటాయించిందని తెలియజేశారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు బోనాల శ్రీనివాస్ వెల్లడించారు. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. నరేశ్ దుప్పట్ల(దుబ్బాక), బి.దిలీప్(మెదక్), ఎస్.రవీంద్రనాథ్(ముషీరాబాద్), వి.నర్సింగ్గారావు(కార్వాన్), బోనాల శ్రీనివాస్ (గోషామహల్), నరేశ్ గౌడ్(లాల్ బహద్దూర్ నగర్), ముఖేశ్ మేరు (భువనగిరి), పద్మజా గడ్డం (కుత్బుల్లాపూర్), ధర్మేంద్ర తివారి(ఉప్పుల్), రమేశ్(నల్గొండ) వెంకటయ్య (నాగర్ కర్నూల్), సర్దార్ గురుదయాల్ సింగ్(సనత్ నగర్), ఓంప్రకాశ్ శర్మ(రాజేంద్రనగర్), బి.దీపిక (చాంద్రాయణగుట్ట), ఇప్పతి ఆంజనేయులు(మహబూబ్ నగర్), తదితరులు పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కామన్ సింబల్ కేటాయించిన ఎన్నికల కమిషన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు ఎంకే నరేందర్, నరేశ్, దామోదర్ శర్మ,దేవ్జ్,రాజు,తదితరులు పాల్గొన్నారు