ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ పనులు జరుగుతున్నాయి…

–  జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు…
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ పనులు జరుగుతున్నట్లు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఏ భాస్కరరావు తెలిపారు. బుధవారం నాడు కలెక్టరేటు కార్యాలయంలో వున్న ఇవిఎం యంత్రాల గోదాములో జరుగుతున్న ఇవిఎం యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఫస్ట్ లెవల్ చెకింగ్) పనులను ఆయన పర్యవేక్షించారు. ఈనెల 5 వ తేదీ నుండి 12 వ తేది వరకు చేపట్టిన ఎఫ్ఎల్. సి కార్యక్రమంలో ఇసిఐఎల్ కు చెందిన 8 మంది ఇంజనీర్లు పరిశీలిస్తున్నారని, ఇప్పటి వరకు 1556 బ్యాలెట్ యూనిట్లకు గాను 380 యూనిట్లు, 736 కంట్రోల్ యూనిట్లకు గాను 371 యూనిట్లు, 895 వివిప్యాట్లకు గాను 366 వివిపాట్లను పరిశీలించడం జరిగిందని, అత్యంత పారదర్శకంగా తనిఖీ పనులు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, డిప్యూటీ తహశీలుదారు సురేశ్, శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.