మొదటి సంవత్సరం దోస్త్ స్పేషల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
2023-2024 విద్యా సంవత్సరం నుండి డిచ్ పల్లి మండల కేంద్రంలోని సిఎండి లో నూతనంగా ప్రారంభించబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరములో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు దోస్త్ స్పేషల్ డ్రైవ్ రూస్ ఆన్లైన్ లో అప్లయి చేసుకోవాలని డిగ్రీ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ పి రాంమోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇనేల  28- నుండి ప్రారంభమయ్యే స్పేషల్ ఫేజ్  లో విద్యార్థులు సిఎం,సిబిసి ఎస్ ఇంగ్లీష్,బి,కాం (Comp Appl) బిబిసి ఎస్ ఇంగ్లీష్, బి.ఎస్సి  (లైఫ్ సైన్సెస్ ) సిబి సిఎస్ ఇంగ్లీష్, బి.ఎస్సి (ఫిజికల్ సైన్స్) సిబిసిఎస్ ఇంగ్లీష్ కోర్సులలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతీ కోర్సులో 60 సీట్లు ఉంటాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు