చేపలును పట్టారు.. చెరువులు ఖాళీ చేశారు..

నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మగశిర కార్తె సందర్భంగా శనివారం అన్ని గ్రామాల్లో చెరువులు దగ్గర చేపల కోసం ప్రజలు బారులు తీరునారు.కొందరు యువకులు,మహిళలు చేప ప్రసాదం కోసం కందుకూరు గ్రామానికి తెల్లవారుజామున నుండే ప్రయాణం ప్రారంభించారు.మగశిర నాడు కచ్చితంగా చేప మాంసం తినాలి అనే సిద్దాంతాన్ని నమ్మిన పలువురు చేప ప్రియులు గ్రామంలో గల చెరువులు,కుంటలు దగ్గర ఉదయం 5 గంటల నుండే లైన్‌ కట్టినారు.ఇదే అదునుగా భావించిన పలువురు చేపలు పెంపకం దారులు కేజీ చేపలు 150 రూపాయలు నుండి 200 వరకు అమ్ముకొని సొమ్ములు చేసుకున్నారు.ఎది ఏమైనా చెరువుల్లో చేపలు మొత్తం ఖాళీ చేశారు.