మత్స్యకార అడక్ కమిటీని వెంటనే రద్దు చేయాలి..

– రమణ ముదిరాజ్ 
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్ : నిబంధనలను తుంగలో తొక్కి మోసపూరితంగా ఏర్పాటు చేసిన మత్స్య పారిశ్రామిక సంఘం అడక్ కమిటీని వెంటనే రద్దు చేయాలని మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయినా రమణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నూతనంగా జిల్లా మత్స్య శాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన నరసింహారావు ను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న చెరువు మత్స్య సొసైటీలకు యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు జరిపించాలని కోరారు. నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటులో భాగంగా 11 మంది ప్రమోటర్లకు గాను 17 మంది పోటీలో ఉండగా కేవలం 11 మందిని ఒకేసారి నిలబెట్టి వారే గెలిచినట్లుగా అన్యాయంగా ప్రకటించారని అట్టి కమిటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా నీళ్లు లేని చెరువులు, కుంటల్లో కూడా చాప పిల్లలు పోసినట్లుగా రికార్డ్స్ లో నమోదు చేసినట్లుగా తెలుస్తోందని కావునా అట్టి బిల్లులకు కూడా డబ్బులు చెల్లిస్తే విజిలెన్స్ విచారణ తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం జిల్లా కార్యనిర్వహక అద్యక్షులు కొర్వి శ్రీనివాస్, జిల్లా ముదిరాజ్  నాయకులు పులకరం భిక్షం పాల్గోన్నారు.