ఛైర్మన్ పదవికి ఐదేళ్ల రిజర్వేషన్ ముగిసింది.. తదుపరి ఎవరో..

– ఎస్సీ మహిళ గా రిజర్వుడు వస్తుందనే పుకార్లు నిజమేనా..
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు గాను ఐదు సంవత్సరాల పాటు ప్రకటించిన రిజర్వేషన్ల సమయం పూర్తయినట్లు తెలుస్తోంది ఇక రాబోయే చైర్మన్ పదవికి రిజర్వేషన్ ఎవరికోసమో అనే చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ల సమయం ఐదేళ్లు గడిచిపోయినట్లు, ఇక రాబోయేది ఎవరికోసమో అనే దానిపై కూడా ప్రత్యేకంగా చర్చలు వినబడుతున్నాయి. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎస్సీ మహిళా గా రిజర్వేషన్ వస్తుందనే చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం రిజర్వేషన్లు ఈ విధంగా కొనసాగాయి. మొదట ఓసీ జనరల్ ఆ తర్వాత ఎస్టీ, జనరల్ మూడోసారి ఓసీ, మహిళా నాలుగోసారి బీసీ బీ జనరల్, ఐదోసారి ఓసీ జనరల్ గా ఛైర్మన్ పదవులు కొనసాగడం జరిగింది. ఇక ఛైర్మెన్ పదవి కోసం ఏ విధంగా రిజర్వేషన్ వస్తుంది అనేది మద్నూర్ మార్కెట్ పరిధిలోని మద్నూర్ జుక్కల్ డోంగ్లి మూడు మండలాల జనాలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి మొదట ఎస్సీ మహిళగా రిజర్వేషన్ వస్తుందనేది చర్చలు వినబడుతున్నాయి. ఇలాంటి చర్చలు ఎంతవరకు నిజమో కానీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎదురుచూసిన ఆశామహులు నిరాశకు గురయ్యే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఓసీ, బీసీ, రిజర్వేషన్ వస్తే ఆశామహులకు చైర్మన్ పదవిని పొందడానికి ఆశించవచ్చు కానీ ఎస్సీ, ఎస్సీ మహిళా, రిజర్వేషన్ వస్తే మాత్రం ఆశామహులు నిరాశకే గురికావాల్సి వస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జుక్కల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ప్రత్యేకంగా కృషిచేసిన ముఖ్య నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందని దానిపై ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎస్సీలకు కేటాయిస్తారని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఓసీ, బీసీ ముఖ్య నాయకులంతా నిరాశకు గురి కావాల్సిందే. ప్రభుత్వపరంగా ఐదుసార్లు ఛైర్మన్ పదవుల కోసం రిజర్వేషన్లు కొనసాగిన తర్వాత మళ్లీ రిజర్వేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికోసం అనుకూలమైన రిజర్వేషన్. వస్తుందో వేచి చూడాలి.