నల్లగొండ గడ్డపై ఆత్మగౌరవ పతాక ఎగురవేస్తా

 – నియోజకవర్గ లో  రాజకీయాన్ని డబ్బులు మయం  చేసిన దుర్మార్గుడు కోమటిరెడ్డి 
 – కొనలేదని ప్రమాణం చేస్తే నామినేషన్ ఉపసంహరణ
 – కక్షలకు..కుట్రలకు..  కుతంత్రాలకు చిరునామా  భూపాల్ రెడ్డి 
 – పోస్టులన్నీ  అతని వర్గానికే
 – లక్షలు పెట్టి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆగలేదు 
 – ఎమ్మెల్యే అయినాక అన్ని చేస్తా 
– ఏ.ఐ.ఎఫ్.బి అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్
 నవతెలంగాణ నల్గొండ: నల్లగొండ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ఆధిపత్య వర్గాలే ఏలుతున్నాయి. ఈ దాఫా ఎన్నికల్లో సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ పతాక ప్రజలు ఎగురవేస్తారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నల్లగొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పిల్లి రామరాజు యాదవ్ గురువారం   నల్లగొండ పట్టణంలోని అక్కలాయిగూడెం నుండి నామినేషన్ వేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి భాస్కర్ టాకీస్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి గడియారం చౌరస్తాలో నామినేషన్ కు మద్దతుగా వచ్చిన అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖాలు చేశారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నల్లగొండలో 20 ఏళ్లు ఏలిన వెంకట్ రెడ్డి ఐదేళ్లు కనపడకుండా పోయి ఇవాళ డబ్బుల సంచులతో వచ్చి నాటకాలు ఆడుతున్నాడని ప్రజలు గమనించాలన్నారు. కోట్ల రూపాయలు పెట్టి సర్పంచులను, ఎంపీటీసీలను జడ్పిటిసి లను కౌన్సిలర్లను అంగట్లో పశువులను కొన్నట్లు వెంకట్ రెడ్డి కొంటున్నాడని డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని విర్ర వీగుతున్న వెంకట్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.నల్లగొండ నియోజకవర్గ రాజకీయాన్ని డబ్బులమయం చేసిన దుర్మార్గుడు వెంకట్ రెడ్డి అని ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి డబ్బులు పెట్టి నేను ఏ ప్రజా ప్రతినిధి కొనలేదని రామగిరి సెంటర్ లో ని రామాలయంలో ప్రమాణం చేస్తే ఈ గడియారం సెంటర్ వేదికగా నా నామినేషన్ విరమించుకుంటానని వెంకట్ రెడ్డికి సవాలు విసిరాడు.
 ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పట్టణంలోని హైదరాబాదు రోడ్డు ఒకటి వేయించి ఇదే అభివృద్ధని నాటకం ఆడుతున్నాడని మండిపడ్డారు. రోడ్డు వెడల్పు పేరుతో 5000 మంది ఉపాధి కోల్పోయారని వారన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, డిఎంహెచ్ఓ కార్యాలయంలో లోని ఖాళీగా ఉన్న పోస్టులన్నీ తమ అనుకూలమైన వారికి ఔట్సోర్సింగ్ సంస్థల ద్వారా ఇచ్చి లక్షల రూపాయలు దన్నుకున్నాడని ఆరోపించారు.25 ఏళ్లలో వీరిద్దరి హయాంలో ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు.నేను సింహం గుర్తు పై పోటి చేయడానికి సిద్దమైతే భూపాల్ రెడ్డి లక్షల రూపాయలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా నా సింహం గుర్తు ఆగలేదన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక అడ్డదారులు తొక్కుతున్నాడని ప్రజలకు వివరించాడు.కక్షలకు కుట్రలకు కుతంత్రాలకు చిరునామా భూపాల్ రెడ్డి అన్నారు.భూపాల్ రెడ్డి ని సొంత పార్టీ కార్యకర్తలే రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ లను ప్రజా ప్రతినిధులను ఈగ కంటే హీనంగా చూశాడని,  అహంకారపూరిత రాజకీయాలే ఆయనను సమాధి చేస్తున్నాయని ఇది గుర్తు ఎరగాలని అన్నారు. ఈ ఐదేళ్లలో ఒక గ్రామానికి కూడా ఒక బీటీ రోడ్డు వేయలేదని ఆరోపించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జిల్లా కేంద్రంలోని మండలాలకు, మండల కేంద్రం నుండి గ్రామాలకు అన్ని రోడ్లను పూర్తి చేస్తానని తెలిపారు. ప్రతి పేదింటి ఆడపిల్లకు పుస్తె మెట్టలు అందిస్తానన్నారు. అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించుకొని గడపగడపకు వస్తున్నాని ఆదరించే అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశాడు.   మీ హయాయంలో ఎంతమందిక బహుజనులకు, అగ్రవర్ణ పేదలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇప్పించినరో చెప్పాలి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి ని ప్రశ్నించారు.   ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే నిరంతరం అందుబాటులో ఉంటానని సింహం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలన్నారు.డబ్బులు సంచులతో వస్తున్న వారిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.ఈ  కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, జిల్లా జేఏసీ చైర్మన్ పందుల సైదులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము, మైనార్టీ నాయకులు శమీరుద్దీన్ యూసుఫ్, నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వాయి రవి, కూతురు జానారెడ్డి,సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.