రెపరెపలాడిన మువ్వన్నెల జెండా…

Waving flag of three moons...నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయంత్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామ్మోహన్ జాతీయ జెండాను ఎగరవేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ ల కార్యాలయం ముందు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, యువజన సంఘాల్లో అధ్యక్షులు, కుల సంఘాల్లో అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగరవేశారు.