ప్రవాహం ఆగదు

The flow doesn't stopదాడులతో దూషణలతో రాతలు చెరిపేస్తే
ధిక్కార గొంతుల పిక పిసికేస్తే
అబద్ధాలు నిజమైతాయా
ప్రశ్నించేటోళ్లు పుట్టుకచ్చుడు బందైతర

భయపెట్టో బెదిరించో
ఎదురు తీరుగా ఏసిన తోవ్వలను తవ్వేస్తే
కొత్తదారులు ఎసుకుంటూ అచ్చేటోళ్లను ఆపతరమా

కట్టలు గట్టి పారేనీళ్లను నిర్బంధం చేస్తే
గండ్లువాడుడు మగ్గుతాయా
బీడును తడుపక ఊకుంటాయా

చీకటి గదుల్లో స్వేచ్ఛను బంధించినంత మాత్రాన
ఉబికి వచ్చే ఉడుకు రక్తం ఎదురు తిరుగుడు మానుతద

చీకటి గంగానే అస్తమించిన సూర్యులను చూసి
అయిపోయిందని ఆనందపడితే
తిరిగచ్చే ప్రకాశ కిరణాలను తట్టుకొని నిలదోక్కుకోగలర

గాయి గాయి ఒర్రి గత్తర్లేపి
మర్రవడే గొంతులను తొక్కేస్తామనకుటుర్రేమో
మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు

అనగదొక్కి ఆశ జూపి బొంద పెడదమని భ్రమిస్తున్నారేమొ
భ్రమలను బద్దలు గొట్ట
పిడికిళ్లేత్తే అగ్ని పర్వతాలున్నాయని మరిసిపోతున్నారు

– జి.యం.నాగేష్‌ యాదవ్‌ 9494893625