రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం

నవతెలంగాణ – తుంగతుర్తి
రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి సూర్యాపేట జిల్లా కోశాధికారి కుంచాల శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం యావత్ తెలంగాణ రెడ్డి కుటుంబాలకు సంతోషకరమైన విషయం అన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. పేద రెడ్డి కుటుంబాలకు చెందిన ఎంతోమంది ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి గ్రామశాఖ అధ్యక్షులు వడ్లకొండ వెంకట్ రెడ్డి,బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి,పోగుల శ్రీకాంత్ రెడ్డి,కుంచాల ప్రవీణ్ రెడ్డి, అండెం వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి,బాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి,మధురాం రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.