ప్రభుత్వ ఆస్పత్రిని, పట్టణ మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టును, వైద్య కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి

నవతెలంగాణ- కంటేశ్వర్ 

నిజామాబాద్ నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది దగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  పాల్గొని పట్టణ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టును, ప్రభుత్వ ఆస్పత్రిని, ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ.. నిజామాబాద్ పట్టణంలో నాలుగు సంవత్సరాల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించిన భూగర్భ మరుగునీరు శుద్ధి ప్రాజెక్టు సంవత్సరాలు గడుస్తున్న అడుగు ముందుకు పడడం లేదని 246 కోట్ల ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నారు తప్ప ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ప్రయోజనం మాత్రం అందించలేకపోయారని మండిపడ్డారు. మురుగు నీటిని శుద్ధి చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రాజెక్టుకు ఇప్పటివరకు నగరంలోని ఇళ్లకు మురుగునీటి కనెక్షన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటలు ఆయన అన్నారు. డ్రైనేజీ సిస్టం ద్వారా మురుగు నీటిని సేకరించడంలో ఈ ప్రాజెక్టు పనితీరు సరిగా లేదని నగరంలో మురుగునీరు ద్వారా దోమలు మరియు ఇతరత్రా క్రిమి కీటకాలు చేరి పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి 246 కోట్లతో ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెప్పారు తప్ప ప్రాజెక్టు పని తీరును పర్యవేక్షించలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు కళ్ళు తెరిచి నగరంలోని అన్ని ప్రాంతాలకు డ్రైనేజీ సిస్టం మెరుగుపరిచి మొరుగునీటిని సేకరించి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు మెడికల్ కాలేజీలు సందర్శించడం జరిగింది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు అధికారులతో కలిసి ఆస్పత్రి మొత్తం కలియతిరిగి అక్కడున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రిని తాను మంత్రిగా ఉన్న సమయంలో అన్ని సదుపాయాలతో ఆసుపత్రిని జిల్లాకు మంజూరు చేయించడం జరిగిందని కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగా ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు  వైద్య సిబ్బంది లేక ఇక్కడికి వచ్చే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుచేసి పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారికి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నన్నారు. అనంతరం మెడికల్ కళాశాలలో సందర్శించి అక్కడున్న అధికారులతో అక్కడున్న సిబ్బంది మరియు విద్యార్థుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.అనంతరం ఆయన విద్యార్థులను కలిసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులు వైద్య విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో మెడికల్ కళాశాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పన మరియు బోధన బోధనేతర సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుందని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.ప్రభుత్వం మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కళాశాలలో బోధన బోధనెతర సిబ్బందిని నియమించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ ,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ ,రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ,పిసిసి కార్యదర్శి రాంభూపాల్ ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంతిరెడ్డి రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, అబూద్ బీన్ హమ్దాన్, సేవాదళ్ సంతోష్, పీసీసీ డెలిగేటి ఈసా ,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం ,అబ్దుల్ ఎజాజ్, గంగారెడ్డి, అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.