– నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2945.5 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మక్తల్, నారాయణపేట, కోడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సీఎం రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి దీని కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.