
కులమతాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మండలకేంద్రంలోని రిజర్వాయర్ సమీపంలో సుమారు 41అడుగుల ఎత్తు గల వాయుపుత్రవిగ్రహ నిర్మాణం కోసం దిమ్మె శంఖుస్థాపన కార్యక్రమం మంగళవారం కొడకండ్ల భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కుల పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొడకండ్ల భాస్కరాచార్యులు మాట్లాడారు. రిజర్వాయర్ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ధర్మసాగర్ రిజర్వాయర్ ప్రాంతంలో 41 అడుగుల వాయు పుత్రుని విగ్రహాన్ని కుల మతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా అన్ని కులాల పెద్దలతో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఈరోజు ధనరాశిపూజ, విగ్రహము కింద ముత్యం, పగడము, వెండి, బంగారము, పాత నాణ్యాలతో ధన రాశి పూజ ఘనంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలోని అన్ని కుల పెద్దల సహాయ సహకారాలతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చున్నారు. ఈ పూజలో మైనార్టీ నాయకులు11 పురాన (పాత)నాణాలను సమర్పించి పూజలు పాల్గొనడం ధర్మసాగర్ గ్రామ ప్రజల ఐకమత్యానికి ప్రత్యేకగా నిలబడడం ఈ గ్రామం యొక్క విశిష్టతకు నిదర్శనం అన్నారు. ఈ నిర్మాణం అందరి సహాయ సహకారాలతో నడిపించుకోవడం మహాదానందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు బిరుదు రాజు రఘుపతి రామరాజు, రాజు గారి రఘు, తోకల జైపాల్ రెడ్డి, జీకే షాపింగ్ మాల్ ప్రోప్రైటర్ గుర్రపు రమేష్, బొడ్డు ప్రభుదాస్, లాల్ మొహమ్మద్, మహమ్మద్ యాసిన్, చల్ల శ్రీనివాస్ రెడ్డి, గోసంగి శివ, బొల్లం రవీందర్, రాజు, రమేష్, నాగవల్లి యుగంధర్, నాగవెల్లి విజయ్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పాక శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.