నాలుగో విడత నిజాం సాగర్ నీటి విడుదల

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజం సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంట సాగు కోసం నాలుగో విడత నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. నీటిని వృధాగా పోనివ్వకూడదని ఆయన తెలిపారు. ప్రతిరోజు 1600 క్యూసెక్కుల చొప్పున 10 రోజులపాటు నీటిని వదులుతామని ఆయన తెలిపారు. రైతులందరూ కూడా గమనించగలరని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.891 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు.